
తిరుమల, 22 ఆగస్టు (హి.స.)
: తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం అందింది. హైదరాబాద్కు చెందిన బండి సత్యనారాయణ అనే భక్తుడు శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు ఈ విరాళం అందజేశారు. శనివారం హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడును కలిసి ఈ విరాళం డీడీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన దాతను అభినందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ