అనకాపల్లి.కి. నీళ్లు తెచ్చే బాధ్యత నాది...చంద్రబాబు
అనకాపల్లి.కి. నీళ్లు తెచ్చే బాధ్యత నాది...చంద్రబాబు
Chandrababu Naidu(file)


అనకాపల్లి జిల్లా,, 22 ఆగస్టు (హి.స.)

:జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. అనకాపల్లి అంటే బెల్లం ఒక్కటే కాదని.. ఇండస్ట్రియల్ ఏరియా అని అన్నారు. రాబోయే రోజుల్లో దేశంలోనే అనకాపల్లి జిల్లా నం.1 అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అనకాపల్లికి నీళ్లు తెచ్చే బాధ్యత తనది అని స్పష్టం చేశారు. త్వరలోనే అనకాపల్లి, విశాఖకు గోదావరి నీళ్లు తీసుకొస్తామని.. జిల్లాలో ప్రతి చెరువు, రిజర్వాయర్లను నింపుతామని వెల్లడించారు. సెప్టెంబర్ తొలి వారంలోనే అనకాపల్లికి నీళ్లు తెచ్చి చూపిస్తామని పేర్కొన్నారు. ‘మేం చేస్తున్న పనులను అభినందిస్తే అదే పెద్ద కిక్’ అని చెప్పుకొచ్చారు.

మంచిపనులు చేస్తుంటే కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారని సీఎం మండిపడ్డారు. విమర్శలు చేసేవారికి డేటా సెంటర్ అంటే తెలియదని విమర్శించారు. ఇప్పటి వరకు డేటా సెంటర్ ప్రారంభం కాలేదని, తాగడానికి నీళ్లు లేవంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా సెంటర్ వస్తే లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. డేటా సెంటర్లతో ఆదాయం కూడా పెరుగుతుందని తెలిపారు. దేశంలో తొలిసారి క్వాంటం కంప్యూటర్ అమరావతికి వస్తోందన్నారు. విద్యార్థులకు ఇప్పటి నుంచే Ai టెక్నాలజీ నేర్పాలని సూచించారు. Ai నేర్చుకుంటే రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని జయించవచ్చారు.

అభివృద్ధి అంటే పరిశ్రమలు, పెట్టుబడులు మాత్రమే కాదని.. పర్యావరణ పరిరక్షణ కూడా అభివృద్ధిలో భాగమే అని చంద్రబాబు అన్నారు. చెత్త నుంచి కంపోస్ట్, కరెంట్, గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామం జీరో వేస్ట్ పంచాయతీగా తయారుకావాలని సూచించారు. ఆడబిడ్డల కోసం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని, రాబోయే రోజుల్లో మూడు గ్యాస్ సిలిండర్ల డబ్బులను 4 నెలలకోసారి జమ చేస్తామన్నారు. ఇండక్షన్ స్టవ్లు పెట్టుకుంటే గ్యాస్తో కూడా అంత పని ఉండదని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande