విజయనగరంలో పర్యటిస్తున్న లోకేశ్
విజయనగరంలో పర్యటిస్తున్న లోకేశ్
Lokesh


విజయనగరం రూరల్ :, 22 ఆగస్టు (హి.స.)

జిల్లా కేంద్రమైన విజయనగరానికి మంత్రి లోకేశ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా వైజంక్షన్ వద్ద ఆయనకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే అదితి ఆధ్వర్యంలో మహిళల కోలాటం, పులి వేషాలు, సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. తెదేపా పాటలకు కార్యకర్తలు హుషారుగా నృత్యాలు చేశారు. మధ్యాహ్నం లోకేష్ బాబా బెట్ట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో హెచ్ఆర్డీ క్లస్టర్ సమావేశంలో పాల్గొని విద్యార్థినులతో ముచ్చటించనున్నారు. అనంతరం చెల్లూరు జంక్షన్ వద్ద తెదేపా ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande