పోలవరం జిల్లా చింతూరు మండలం బోడుగూడెం వద్ద.జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం
పోలవరం జిల్లా చింతూరు మండలం బోడుగూడెం వద్ద.జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం
accident


పోలవరం జిల్లా:, 22 ఆగస్టు (హి.స.)

చింతూరు మండలం బొడుగూడెం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశా నుంచి తమిళనాడుకు ఐరన్ లోడ్తో వెళ్తున్న లారీని వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టింది. రెండు వాహనాలు బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మృతులను తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన నిమ్మకాయల అయ్యన్న (35), తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మియాపూర్కు చెందిన ఆడివి సూర్య వినయ తేజ (28)గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు బాధిత కుటుంబాలకు సమాచారం అందించారు. తమ వారిని కోల్పోవడంతో ఆస్పత్రి వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande