ఏపీ ఏ ఐ మోడల్ భేష్
ఏపీ ఏ ఐ మోడల్ భేష్
AI


అమరావతి, 22 ఆగస్టు (హి.స.)

పన్నుల నిర్వహణ ఒక క్లిష్టమైన ప్రక్రియ..! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వచ్చాక.. ఈ ప్రక్రియ చాలా సులభమైపోయింది. కొన్ని వారాలపాటు పట్టే పనులు సైతం గంటల్లోనే పూర్తవుతున్నాయి. ఖజానాకు ఆదాయం కూడా వస్తోంది. అందుకే ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ రూపొందించిన ఏఐ ఆధారిత జీఎస్టీ పరిపాలన మోడల్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. పన్ను ఎగవేతలను అరికట్టడం, పన్ను వసూళ్లను పారదర్శకం చేయ డం, పన్ను చెల్లింపుదారుల సేవలను మెరుగుపరచడంలో ఏఐని వాడుతున్న తీరును పలు రాష్ట్రాలు అభినందించినట్లు పేర్కొంది. వాణిజ్య పన్నుల విభాగంలో ఏఐ వాడకంపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మోడల్ను ఇటీవల కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సమక్షంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంతోపాటు ఇతర రాష్ట్రాలు ఈ మోడల్ను అభినందించాయని, తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు వారు ఆసక్తిగా ఉన్నారని ప్రభుత్వం తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande