
హైదరాబాద్, 22 ఆగస్టు (హి.స.)
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం పెరిగేకొద్దీ సైబర్ నేరాలు మరింత విస్తరించే ప్రమాదం ఉందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ (ఏకే సింగ్) ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన 'సమకాలీన చట్టపరమైన, నియంత్రణ సమస్యలు' (Contemporary Legal and Regulatory Issues) అనే అంశంపై జరిగిన ప్రత్యేక సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏఐ వల్ల డేటా ట్రాన్స్ ఫార్మేషన్ వేగంగా జరుగుతోందని, నేరాల విచారణలో కొత్త కొత్త సవాళ్లు ఎదురువుతున్నాయని తెలిపారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా న్యాయ విద్య కూడా మారాలన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. శామ్ కోసి కూడా పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..