జాతీయ అవార్డుకు ఎంపికైన కామారెడ్డి జల్లా ఉపాధ్యాయురాలు భవాని బొంపెల్లి
జాతీయ అవార్డుకు ఎంపికైన కామారెడ్డి జల్లా ఉపాధ్యాయురాలు భవాని బొంపెల్లి
teacher


హైదరాబాద్, 22 ఆగస్టు (హి.స.)

దేశ వ్యాప్తంగా పాఠశాల విద్య (School Education), అక్షరాస్యత కోసం విశేష కృషి చేసిన 48 మంది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులను ప్రభుత్వం గుర్తించింది. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో, విద్యార్థులను తీర్చిదిద్దడంలో చూపిన నిబద్ధత, అంకితభావాలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. 27 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వీరిని ఎంపిక చేసినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెల్లడించింది. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో వీరికి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజు సెప్టెంబర్ 5న అవార్డులను అందజేస్తారు.

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల (National Best Teachers)కు ఎంపికయినవారిలో 26 మంది పురుషులు, 22 మంది మహిళలు ఉన్నారు. వీరిని గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాల నుంచి కేంద్రీయ, నవోదయ విద్యాలయాల వరకు, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అన్ని స్కూళ్ల నుంచి ఎంపిక చేశారు.

తెలంగాణ నుంచి రాష్ట్రంలోని కామారెడ్డి జల్లాలోని ఉపాధ్యాయురాలు భవాని బొంపెల్లి ఎంపికయ్యారు. ఆమె గాంధారి మండలకేంద్రంలని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. గణితం పాఠాలను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా సులభంగా బోధిస్తున్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెలంగాణ నుంచి ఆమె ఒక్కరే ఎంపికయ్యారు. ఆమె గతేడాది తెలంగాణ రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande