మంత్రి కొండా సురేఖపై మరో కంప్లైంట్.. 'బర్తరఫ్ చేయాల్సిందే' అంటూ డిమాండ్
మంత్రి కొండా సురేఖపై మరో కంప్లైంట్.. 'బర్తరఫ్ చేయాల్సిందే' అంటూ డిమాండ్
Minister


హైదరాబాద్, 22 ఆగస్టు (హి.స.)

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ అంశం తీవ్రంగా చర్చనీయాంశమైంది. కొండా సురేఖ వ్యవహారశైలి, ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవిని కలిసే అధికారికంగా ఫిర్యాదు చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఎమ్మెల్యేల ఫిర్యాదుపై మల్లు రవి స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండా సురేఖ ఇచ్చిన వివరణను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై ఆమె కుమార్తె చేసిన అనుచిత వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ బహిరంగంగా ఖండించాలని, అలా చేయడం ఆమె కనీస బాధ్యత అని పేర్కొన్నారు. 'డబ్బులు ఇచ్చి సీటు కొన్నారు' అంటూ వచ్చిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర కలకలం రేపాయని, దీనిపై సీరియస్గా దృష్టి సారించామని తెలిపారు. మరోవైపు నేత చిన్నారెడ్డి వ్యవహారంలోనూ కమిటీ పరిశీలన పూర్తయ్యాక తుది చర్యలు ఉంటాయని చెప్పారు. సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఇప్పటివరకు తమకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని తేల్చిచెప్పారు. త్వరలోనే క్రమశిక్షణా కమిటీ పూర్తిస్థాయిలో సమావేశమై పార్టీ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కీలక నిర్ణయాలు తీసుకోనుందని మల్లు రవి వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande