రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో ఇందిరమ్మ టవర్స్: మంత్రి పొంగులేటి
రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో ఇందిరమ్మ టవర్స్: మంత్రి పొంగులేటి
Minister


నిజామాబాద్, 22 ఆగస్టు (హి.స.)

పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉన్న ఇందిరమ్మ ఇండ్లను రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలందరికి ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) . నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి ఇవాళ ఉదయం హౌసింగ్ శాఖకు సంబంధించిన ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. కార్పోరేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న, ఇప్పటికే పూర్తయిన, ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి లబ్దిదారుల మనోగతాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..లబ్ధిదారులతో మాట్లాడినప్పుడు, సొంతింటి కల నెరవేరిందనే ఆనందం వారి కళ్లలో కనిపించింది. ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారు చెప్పిన మాటలు నాకు ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని కలిగించాయి. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులతో మాట్లాడినప్పుడల్లా పేదింటి చిరకాల కలను తీర్చే బాధ్యత దొరకడం అనేది నా అదృష్టంగా భావిస్తుంటా నన్న మంత్రి.. ఈ సందర్భంగా లబ్దిదారులకు కానుకలు అందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ తరహాలో నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ ລໍ (Indiramma Towers) ລ້ ໖໒ పట్టణాలలో కూడ నిర్మించేలా నిజామాబాద్ నుండి శ్రీకారం చుట్టబోతున్నామని మంత్రి చెప్పారు. నిజామాబాద్లో పైలెట్ ప్రాజెక్టు కోసం నిజామాబాద్ కార్పోరేషన్ పరిధిలో ఉన్న కొత్త టెక్నాలజీతో ఇందిరమ్మ మోడల్ టవర్స్ నిర్మిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో రెండు విడతలు, హైదరాబాద్లో ఇచ్చే మొదటి విడత ఇండ్లతో కలిసి 8 లక్షల ఇండ్లు మంజూరు చేశాం, 2 లక్షల ఇండ్లు పూర్తయి గృహప్రవేశాలు కూడ పూర్తయ్యాయన్నారు. అక్కడనుండి నిజామాబాద్ పట్టణంలో గత ప్రభుత్వాలు నిర్మించదలచి, అరకొరగా నిర్మించి వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాన్ని పరిశీలించి, నివాసయోగ్యానికి కావాల్సిన నిర్మాణాలు, వసతులను వెంటనే పూర్తిచేసి, అర్హులైన లబ్దిదారులకు ఎంపిక చేసి ఇండ్లను మంజూరు చేసి, అందించాలని జిల్లా కలెక్టరు, అధికారులను ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande