
సిద్దిపేట, 22 ఆగస్టు (హి.స.)
పట్టణమైనా, హైవే అయినా ప్రమాదం ఎక్కడైనా జరిగే అవకాశం ఉంటుందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ను తప్పనిసరిగా పాటించాలని సిద్దిపేట పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్ అన్నారు. సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీజ్ చేసిన మాడిఫైడ్ సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూలను పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు. ఓవర్ స్పీడ్తో వాహనాలు నడపవద్దని సూచించారు. చట్టవిరుద్ధంగా సైలెన్సర్లను బిగించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలను ఇవ్వవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు