తిరుమలలో గోబీ వంటకాలపై నిషేధం,,...తిరుమలలో భక్తుల ఆరోగ్యంపై టీటీడీ ప్రత్యేక దృష్టి
తిరుమలలో గోబీ (కాలీఫ్లవర్) వంటకాలను టీటీడీ నిషేధించింది. భక్తుల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో భాగంగా ఇప్పటికే తిరుమలలోని రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో.
తిరుమలలో గోబీ వంటకాలపై నిషేధం,,...తిరుమలలో భక్తుల ఆరోగ్యంపై టీటీడీ ప్రత్యేక దృష్టి


తిరుమల, 22 ఆగస్టు (హి.స.) తిరుమలలో గోబీ (కాలీఫ్లవర్) వంటకాలను టీటీడీ నిషేధించింది. భక్తుల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో భాగంగా ఇప్పటికే తిరుమలలోని రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో చైనీస్ వంటకాలను నిషేధించారు. టీటీడీ హెల్త్ డిప్యూటీ ఈవో సోమన్నారాయణ శుక్రవారం తిరుమలలోని రెస్టారెంట్లు, హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్ల నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఇటీవల కాలీఫ్లవర్లో పురుగులు రావడాన్ని గుర్తించామని, భక్తుల ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా గోబీ వినియోగాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande