అభివృద్ధి చేసే ఓటు అడుగుతా : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
అభివృద్ధి చేసే ఓటు అడుగుతా : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
Mla


వరంగల్, 22 ఆగస్టు (హి.స.)

వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. అభివృద్ధి పనులతోనే ప్రజల ముందుకు వెళ్తామని, పనులు చేసి ఓటు అడుగుతామని స్పష్టం చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 49వ డివిజన్లో లెక్చరర్స్ కాలనీ, సాయి బృందావన్ కాలనీలలో పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్నతో కలిసి హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత రెండున్నరేళ్లలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో పెద్ద ఎత్తున రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. గతంలో ఒక డివిజన్కు రూ.50 లక్షలు కేటాయించడం గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం ఒక్కో డివిజన్కు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నామని వివరించారు.

శాయంపేట ప్రాంతానికి సుమారు రూ.20 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టామని, నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. వరంగల్ నగరానికి అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను తీసుకురావడం తన ప్రధాన లక్ష్యాల్లో ఒకటని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరిన మేరకు నగరానికి భారీ వ్యయంతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు మంజూరైందని, ప్రస్తుతం టెండర్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande