ముఖ్యమంత్రి చంద్రబాబు భోగాపురం పర్యటన: నిర్మాణ పనులను పరిశీలించి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న సీఎం
ముఖ్యమంత్రి చంద్రబాబు భోగాపురం పర్యటన: నిర్మాణ పనులను పరిశీలించి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న సీఎం
Chandrababu Naidu(file)


విజయనగరం - విశాఖపట్నం , 23 ఆగస్టు (హి.స.)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం విజయనగరం జిల్లాలోని భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. అంతకుముందు విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ (BRICS) సదస్సు ముగించుకుని నేరుగా భోగాపురం చేరుకున్న ఆయన, అక్కడ శరవేగంగా జరుగుతున్న ఎయిర్‌పోర్ట్ రన్‌వే మరియు ఇతర మౌలిక వసతుల పనుల పురోగతిని అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సమీక్షించారు. పనుల వేగవంతంపై సంతృప్తి వ్యక్తం చేసిన అనంతరం, సీఎం చంద్రబాబు నాయుడు అక్కడి నుండి నేరుగా అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande