నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు షేక్ సాధిక్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు షేక్ సాధిక్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
arrest


కాకినాడ,, 23 ఆగస్టు (హి.స.)

:కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టిల్లపూడి నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు షేక్ సాధిక్ ఖాన్ను పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఓ లాడ్జిలో ఉండగా చాకచక్యంగా అరెస్టు చేశారు. అక్కడి నుంచి కాకినాడకు తీసుకురానున్నారు. సాధిక్కు ముస్లిం తీవ్రవాద సంస్థలతో ఏమైనా లింకులున్నాయా అనే కోణంలోనూ తనిఖీ చేసినట్టు తెలిసింది. ఆదివారం అతడిని కాకినాడ సర్పవరం పోలీసు స్టేషన్లో పీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎనిమిది మంది సీఐల బృందం నూకరాజు, ఆయన కుమార్తె రాసిన సూసైడ్ నోట్ల ఆధారంగానే సాదిక్ను ప్రశ్నించనున్నారు. నూకరాజు కుటుంబంతో పరిచయడం ఎలా ఏర్పడింది? సౌజన్యతో ఉన్న సంబంధం ఏమిటి? ఇలా సుమారు 50కిపైగా ప్రశ్నలను సంధించనున్నట్టు తెలిసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande