
తాడేపల్లి ప్రాంతం, 23 ఆగస్టు (హి.స.)
: ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలు మరియు పాఠశాలల నిర్వహణపై వైస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ బడులు క్రమంగా ఖాళీ అవుతున్నాయని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి, నాడు-నేడు వంటి విప్లవాత్మక పథకాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య ఇప్పుడు ఘోరంగా పడిపోయిందని, దాదాపు 5.56 లక్షల మంది విద్యార్థులు ఎక్కడికి పోయారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi