అమెరికాలో ఏపీ వ్యాపారి దారుణ హత్య: కుమార్తె కళ్లెదుటే కాల్చివేసిన దుండగులు.. స్వగ్రామంలో తీవ్ర విషాదం

కృష్ణా జిల్లా, 23 ఆగస్టు (హి.స.)

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త అమెరికాలో దుండగుల కాల్పుల్లో దారుణంగా మరణించినట్లు ఈరోజు ఉదయం ఆయన కుటుంబ సభ్యులకు అధికారిక సమాచారం అందింది. సదరు వ్యాపారి తన కుమార్తెతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, గుర్తు తెలియని సాయుధ దుండగులు ఒక్కసారిగా దాడి చేసి ఆమె కళ్లెదుటే ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘోర ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఈ వార్త తెలియడంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఆయన స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించేందుకు ఏపీ ప్రభుత్వ ఎన్ఆర్ఐ (NRI) విభాగం ప్రతినిధులు అమెరికాలోని అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

 rajesh pande