
నెల్లూరు, 23 ఆగస్టు (హి.స.)
కూటమి అధికారంలోకి వచ్చాక విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డివ్యాఖ్యానించారు. ఈరోజు (ఆదివారం) నెల్లూరు జీజీహెచ్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జెన్ జీ ఐఐటీ స్కాలర్ను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయా సమస్యలపై ప్రజలు ‘నన్ను ప్రశ్నించవచ్చు’ అనే కార్యక్రమం శ్రీకారం చుట్టానని ప్రస్తావించారు.
నెల్లూరు జీజీహెచ్లో ఆయా సమస్యలపై వరంగల్ ఐఐటీలో పీహెచ్డీ స్కాలర్ శ్రీహరి తనకు మెసేజ్ చేశారని ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు. జీజీహెచ్లో సౌకర్యాలపై దృష్టి పెట్టాలని కోరారన్నారు. ఈ విషయంపై తాను వెంటనే సమీక్షించానని అన్నారు. జీజీహెచ్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించామని చెప్పారు. జీజీహెచ్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి DSR రఘురాం రెడ్డి, ఇస్కాన్ రామకృష్ణా రెడ్డి దాతలు ముందుకు వచ్చారని వెల్లడించారు. రూ.కోటి వ్యయంతో అభివృద్ధి పనులకు జెన్ జీ శ్రీహరి శంకుస్థాపన చేశారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ