ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం.. మంత్రి పొన్నం ప్రభాకర్
ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం.. మంత్రి పొన్నం ప్రభాకర్
Minister


హుస్నాబాద్, 23 ఆగస్టు (హి.స.)

రాష్ట్రంలోని ఆటో కార్మికుల సమస్యలు

పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆదివారం అర్థరాత్రి నుంచి ఆటో (Auto Drivers Strike), క్యాబ్, పాఠశాల వ్యాన్ డ్రైవర్లు తలపెట్టిన నిరవధిక బంద్ ఉపసంహరించుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) విజ్ఞప్తి చేశారు. ఆటో కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సమ్మెల వల్ల సమస్యలు పరిష్కారం కావు అని, చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఇవాళ హుస్నాబాద్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ మాట్లాడుతూ ఆటోల బందుపై స్పందించారు.

2015 తర్వాత రాష్ట్రంలో ఆటో ఛార్జీలు పెరగలేదని మంత్రి గుర్తుచేశారు. పెరిగిన నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఆటో ఛార్జీల పెంపుపై అధ్యయనం చేయడానికి త్వరలోనే ఒక ప్రత్యేక కమిటీని వేస్తామన్నారు. ఈ కమిటీలో ఆటో కార్మికుల ప్రతినిధులతో పాటు రవాణా శాఖ అధికారులను భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. అలాగే ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే విధివిధానాలు రూపొందించి బోర్డును అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఏ విధంగా పరిష్కరించామో, ఆటో కార్మికుల సమస్యలను కూడా అదే స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆటో డ్రైవర్ల ఇబ్బందులను సైతం పరిగణనలోకి తీసుకుని వారికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande