బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం తో ఉత్తరాంధ్రలో వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం తో ఉత్తరాంధ్రలో వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం తో ఉత్తరాంధ్రలో వర్షాలు


అమరావతి, 23 ఆగస్టు (హి.స.)

ః:బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. వానలు పడే నేపథ్యంలో ఆయా జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తీరప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉందని హోం మంత్రి అనిత వెల్లడించారు. మత్స్యకారులు వాతావరణ శాఖ హెచ్చరికలను పాటించి వేటకు వెళ్లొద్దని ఆదేశించారు. తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మార్గనిర్దేశం చేశారు. ఈ క్రమంలో పోలీస్, రెవెన్యూ, మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. వాతావరణ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని హోం మంత్రి అనిత ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande