
ఖమ్మం, 23 ఆగస్టు (హి.స.)
తెలంగాణ ఏపీ రాష్ట్రాల నుంచి
పేదలకు రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రంగా వరుసగా రేషన్ బియ్యం పట్టుబడుతుండటంతో రేషన్ బియ్యం తరలింపు పెద్ద ఎత్తున జరుగుతుందనే విషయం పేద మధ్య తరగతి ప్రజల్లో ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో పేద ప్రజలకు ప్రభుత్వాలు అందిస్తున్న పిడిఎఫ్ బియ్యాన్ని కొందరు దళారులు పక్కదారి పట్టిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఏపీ రాష్ట్రం విజయవాడ నుంచి ఛతిస్గడ్ రాష్ట్రానికి అక్రమంగా లారీలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని శనివారం అర్ధరాత్రి వి ఎం బంజర్ పోలీసులు పట్టుకొని వి యం బంజర స్టేషన్ కు తరలించి రేషన్ బియ్యాన్ని విజయవాడ తదితర ప్రాంతాల నుంచి అక్రమంగా తరలిస్తున్న గుర్తించారు. లారీ డ్రైవర్ కవులూరు శ్రీనివాసరావు, రేషన్ బియ్యం విక్రయ దారుడు ఆలూరి నరేష్, పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న 3 12 క్వింటాల 70 కిలోలు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..