ఎన్టీఆర్ జిల్లాలోని తారకరామ కాల్వలో స్కూలు బస్సు బోల్తా
ఎన్టీఆర్ జిల్లాలోని తారకరామ కాల్వలో స్కూలు బస్సు బోల్తా
accident


కొండూరు, 23 ఆగస్టు (హి.స.)

ఎన్టీఆర్ జిల్లాలోని తారకరామా కాల్వలో స్కూలు బస్సు బోల్తా పడింది. జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం-కవులూరు మధ్యలో ఇబ్రహీంపట్నానికి చెందిన శ్రీచైతన్య స్కూల్ బస్సు శనివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది విద్యార్థులున్నారు. కాల్వలో నీరు నిండుగా లేకపోవడంతో విద్యార్థులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సమీపంలో ఉన్న రైతులు, కూలీలు కాల్వలో దిగి విద్యార్థులను కాపాడారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande