హైవేపై కంటైనర్ బోల్తా.. ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న ఎంపీ డీకే అరుణ
హైవేపై కంటైనర్ బోల్తా.. ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న ఎంపీ డీకే అరుణ
Traffic jam


హైదరాబాద్, 23 ఆగస్టు (హి.స.)

శంషాబాద్ మండలం పాలమాకుల

వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై కంటైనర్ బోల్తా పడింది. కంటైనర్ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

సుమారు మూడు గంటలుగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాల్లోనే ఉండిపోవడంతో చిన్నారులు, మహిళలు అవస్థలు పడుతున్నారు. ఈ ట్రాఫిక్ లో బీజేపీ ఎంపీ డీకే అరుణ కూడా చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని క్రేన్ సాయంతో కంటైనర్ను తొలగించే చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande