నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో తీపి కబురు: డీఎస్సీ (DSC) ద్వారా అదనంగా మరో 3,000 టీచర్ పోస్టుల భర్తీ
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో తీపి కబురు: డీఎస్సీ (DSC) ద్వారా అదనంగా మరో 3,000 టీచర్ పోస్టుల భర్తీ
ap


అమరావతి, 23 ఆగస్టు (హి.స.)

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మధ్యాహ్నం మరో భారీ శుభవార్త అందించింది. ఇప్పటికే మెగా డీఎస్సీ ప్రకటనతో ఉత్సాహంగా ఉన్న అభ్యర్థుల కోసం, విద్యాశాఖలో ఉన్న అదనపు ఖాళీలను పరిగణనలోకి తీసుకుని డీఎస్సీ ద్వారా మరో 3,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైల్ మరియు డిజిటల్ నివేదికల ప్రక్రియను విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈరోజు శరవేగంగా పూర్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను పూర్తిగా నివారించి, విద్యా ప్రమాణాలను పెంచాలనే ఉద్దేశంతోనే ఈ అదనపు పోస్టులను కలుపుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande