మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నేడు.గ్రీవెన్స్ కార్యక్రమం
మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నేడు.గ్రీవెన్స్ కార్యక్రమం
మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నేడు.గ్రీవెన్స్ కార్యక్రమం


గుంటూరు, 24 ఆగస్టు (హి.స.)

గుంటూరు జిల్లాలోని మంగళగిరి టీడీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ, పోలీస్, భూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులే అధికంగా వచ్చాయని మంత్రి తెలిపారు. ముఖ్యంగా భూ సమస్యలు, రెవెన్యూ శాఖలో పెండింగ్లో ఉన్న అంశాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పార్టీ గ్రీవెన్స్ ద్వారా ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పారు. వచ్చిన ప్రతి అర్జీని నమోదు చేసి.. సమస్య పరిష్కారమయ్యే వరకూ ఫాలోఅప్ చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande