కొండా సురేఖ పార్టీలోకి రావాలా వద్దా అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది.. ఎంపీ డీకే అరుణ
కొండా సురేఖ పార్టీలోకి రావాలా వద్దా అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది.. ఎంపీ డీకే అరుణ
Mp


హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.)

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ భవిష్యత్ కార్యాచరణ ఏంటనే చర్చ జోరుగా జరుగుతోంది. తనను మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేస్తే ఆమె కాంగ్రెస్ కు రాజీనామా చేసి మరో పార్టీలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ కొండా సురేఖ బీజేపీలో చేరికపై ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ పార్టీలోకి రావాలా వద్దా అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇవాళ మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడిన డీకే అరుణ.. పలు కీలక అంశాలపై స్పందించారు. ఈసారి మహబూబ్ నగర్ లోకల్ వాళ్లకే ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారని చెప్పారు.

బీజేపీ జాతీయ నూతన కమిటీపై స్పందిస్తూ.. ఎవరినైనా ఒక బాధ్యత నుండి తీశారంటే దానికంటే మంచి బాధ్యత ఇస్తారేమో?.. బండి సంజయ్ జనరల్ సెక్రెటరీ గా లేరు.. మంత్రి అయ్యాక పార్టీ బాధ్యత ఉండదు. నేను ఎంపీ అయ్యాక సమయం సరిపోక కర్ణాటక ఇంచార్జిగా వదిలేశానన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలమంతా కలిసే ఉన్నామని చెప్పారు. ఆగస్టు సంక్షోభం కాంగ్రెస్కు ఉందని ఎవరిని గద్దె దించి ఎవరిని పెడతారో? ఎవరి గద్దె ఎవరు కూల్చుతారో చూడాలన్నారు. రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పై ఆంక్షల విషయంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి అన్ని తెలుసని పాస్ పోర్టుకు కూడా క్లియరెన్స్ ఉండాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande