
హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.)
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలతో పాటు ప్రధానంగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు, ఆ తదనంతర పరిణామాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు సమాచారం. గత కొద్దిరోజులుగా చోటుచేసుకుంటున్న వివాదాస్పద అంశాలు పార్టీ ప్రతిష్టపై చూపుతున్న ప్రభావం, ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి చర్యలపై ఇరువురు నేతలు విశ్లేషిస్తున్నారు. దీనితో పాటు పాలనాపరమైన అంశాలు, శాఖల పనితీరు, రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల భేటీ ప్రాధాన్యత సంతరించుకోవడంతో కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు