
హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.)
కమ్యూనిస్టు సీనియర్ నాయకుడు, రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి(88) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.
రేపు ఉదయం ఎంబీ భవన్కు ఆయన పార్థివ దేహాన్ని తరలించనున్నారు. అక్కడ అభిమానుల సందర్శనార్థం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఉంచనున్నారు.
మల్లారెడ్డి స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట. ఆయన కొన్ని దశాబ్దాలుగా రైతు సమస్యలపై పోరాడుతున్నారు. అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడిగానూ ఆయన పనిచేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..