జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా 121 మద్యం బ్రాండ్లకు అనుమతా?: హరీశ్ రావు
జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా 121 మద్యం బ్రాండ్లకు అనుమతా?: హరీశ్ రావు
Harish Rao


హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.)

రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంలో మీనమేషాలు లెక్కిస్తూ 121 మద్యం బ్రాండ్ల నోటిఫికేషన్లు మాత్రం ఆఘమేఘాల మీద విడుదల చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. 121 రకాల మద్యం బ్రాండ్స్ కు నోటిఫికేషన్ ఇవ్వడంపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. యువత భవిష్యత్తుకు భరోసా ఇచ్చే జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వని మీకు, మద్యం వ్యాపారానికి మాత్రం ఇంత తొందర ఎందుకు? అని ప్రభుత్వాన్ని నిలదీశారు

. యువత డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి, జాబ్స్ కోసం ఎదురు చూస్తుంటే, ప్రభుత్వం మద్యం షాపులు పెంచి, బ్రాండ్లు పెంచి, డబ్బు వసూలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. టైమ్కు యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేని ఈ చేతగాని సర్కారు.. మద్యం షాపులకు, బ్రాండ్లకు మాత్రం నోటిఫికేషన్ ఇస్తున్నదన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో మోసం చేశారని, ఇక రాజీవ్ యువ వికాసం.. వికసించక ముందే వాడిపోయిందని ఎద్దేవా చేశారు. రేవంత్ పగ.. యువత దగ అన్నట్లుగా తయారైందన్నారు. జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్.. ఇదేనా రేవంత్ రెడ్డి మీరు చెప్పిన ప్రజా పాలన? అని ప్రశ్నించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande