ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి.. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి.. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
Collector


జగిత్యాల, 24 ఆగస్టు (హి.స.) ప్రజా సమస్యల పరిష్కారానికై

ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత రెండు వారాల నుంచి మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణిని నిర్వహిస్తున్నారు.

సోమవారం జగిత్యాల రూరల్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రీవెన్స్లో ఫిర్యాదులు తీసుకుంటున్న సరళి పరిశీలించారు. ఫిర్యాదుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చిన అర్జీలకు పరిష్కారం అయ్యే దిశగా చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఎంపీడీవో కార్యాలయం విజిట్ వచ్చిన సందర్భంలో కార్యాలయ ఆవరణలో మద్యం సీసాలు చెత్తా చెదారంతో నిండి ఉండడం పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త, నిలిచిన వర్షపు నీరుతో అపరిశుభ్రత ఉండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం నేపథ్యంలో అంటూ వ్యాధులు ప్రబలకుండా నీటిని నిల్వ ఉండకుండా చూడాలని జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తుంటే నిజంగా ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఇలా ఉండటం పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande