భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలి.. జిల్లా యంత్రాంగానికి మెదక్ కలెక్టర్ ఆదేశాలు
భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలి.. జిల్లా యంత్రాంగానికి మెదక్ కలెక్టర్ ఆదేశాలు
Collector


మెదక్, 24 ఆగస్టు (హి.స.)

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మెదక్ జిల్లా ఎల్లో అలర్ట ఉందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు, రక్షణ చర్యలు చేపట్టాలని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న రహదారులు, నీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నిండిపోయి అలుగులు పారే అవకాశం ఉన్నందున ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, ఇరిగేషన్, విద్యుత్, జిల్లా పంచాయతీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande