
హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.)
భారత క్రికెటర్ రిషబ్ పంత్
(Rishabh Pant) మరో రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో తన విధ్వంసక ఆటతో అలరిస్తూ ఈమధ్యే వంద సిక్సర్ల క్లబ్లో చేరిన పంత్.. ఈసారి మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)ని దాటేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా వికెట్ కీపర్గా అతడు రికార్డు నెలకొల్పాడు. కొలంబో టెస్టులో పంత్ ఈ ఫీట్ సాధించాడు.
కొలంబో టెస్టులో తొలి రోజు రిటైర్డ్ హర్ట్ అయిన పంత్.. రెండో రోజు సరార్ష్ జైన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చాడు. ధ్రువ్ జురెల్తో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన పంత్... ఈ క్రమంలోనే ధోనీ ఆల్టైమ్ రికార్డును తన సొంతం చేసుకున్నాడు. టీమిండియా తరఫున అత్యధిక పరుగులు సాధించిన వికెట్ కీపర్గా అవతరించాడీ లెఫ్ట్ హ్యాండర్.
ఇప్పటివరకూ మహీ భాయ్.. 2,496 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం పంత్ ఖాతాలో 2,501కి పైగా రన్స్ ఉన్నాయి. మాజీ వికెట్ కీపర్లు ఫరోఖ్ ఇంజనీర్(1,209), సయ్యద్ కీర్మాణి (1,109), కిరణ్ మోరే(901)లు ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..