శ్రీలంక పర్యటనకు భారత టెస్టు జట్టు ప్రకటన.. స్టార్ ఆల్ రౌండర్ ఎంట్రీ
శ్రీలంక పర్యటనకు భారత టెస్టు జట్టు ప్రకటన.. స్టార్ ఆల్ రౌండర్ ఎంట్రీ
Cricket


హైదరాబాద్, 28 జూలై (హి.స.) ఆగస్టు 15 నుంచి భారత్, శ్రీలంక జట్ల

మధ్య రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ జరగనుంది. కాగా ఈ టెస్ట్ సిరీస్ కోసం భారత పురుషుల క్రికెట్ జట్టును బీసీసీఐ (BCCI) సెలక్షన్ కమిటీ ఈ రోజు (మంగళవారం) ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. జట్టులో యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణలతో పాటు కొత్తగా సరాంశ్ జైన్, గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్లకు చోటు దక్కింది. చాలా రోజుల తర్వాత స్టార్ ఆల్ రౌండర్, సీనియర్ ప్లేయర్ అయిన రవీంద్ర జడేజా తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నాడు.

ఇదిలా ఉంటే ఆగస్టు 7 నుంచి కొలంబోలో జరిగే నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ భారత పర్యటన ప్రారంభం కానుంది. అయితే, జట్టులో ఎంపికైన స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్త్రీత్ బుమ్రా, బ్యాటర్ సాయి సుదర్శన్ల లభ్యత నేషనల్ క్రికెట్ అకాడమీ (BCCI COE) నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ రావడంపై ఆధారపడి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. మరోవైపు, ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అందుబాటులో లేకపోవడంతో తొలి టెస్టు ఎంపికకు ఆయన పేరును పరిగణనలోకి తీసుకోలేదు. శ్రీలంక పరిస్థితులకు అనుగుణంగా స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లతో పాటు యువ ఆటగాళ్లకు పెద్దపీట వేస్తూ 15 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును బీసీసీఐ సిద్ధం చేసింది.

భారత జట్టు:

శుభ్మన్ గిల్ [C], కెఎల్ రాహుల్ (Vc),యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ [WK], సాయి సుదర్శన్, ధృవ్ జురెల్ [WK], రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్త్రీత్ బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సరన్త్ జైన్

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande