ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్..టాప్ 5లో ముగ్గురు ఇండియన్సే
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్..టాప్ 5లో ముగ్గురు ఇండియన్సే
Icc


హైదరాబాద్, 22 జూలై (హి.స.)

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్

విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. 802 పాయింట్లతో మిచెల్... మరోసారి తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 801 పాయింట్లతో రెండవ స్థానంలో గిల్ కొనసాగుతున్నాడు. ఒకే ఒక్క పాయింట్ సాధిస్తే.. మొదటి స్థానాన్ని కూడా గిల్ కైవసం చేసుకునే ఛాన్సులు ఉన్నాయి.

ఆ తర్వాత 767 పాయింట్లతో విరాట్ కోహ్లి మూడో స్థానంలో ఉండగా... 758 పాయింట్లతో రోహిత్ శర్మ నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక భారత జట్టుతో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా రూట్ అద్భుతంగా రాణించి ఆరేళ్ల తర్వాత టాప్ 10లోకి దూసుకు వచ్చాడు. ఏకంగా నాలుగు స్థానాలు మెరుగు పరుచుకొని 8వ స్థానానికి చేరాడు. బాబర్ ఆజం ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. అంటే టాప్ 5లో ఇండియన్ క్రికెటర్లే ముగ్గురు స్థానం దక్కించుకోవడం గమనార్హం.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande