హాకీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆగస్టు 19న భారత్-పాక్ మ్యాచ్
హాకీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆగస్టు 19న భారత్-పాక్ మ్యాచ్
Sports


హైదరాబాద్, 21 జూలై (హి.స.)

పురుషుల హాకీ వరల్డ్ కప్ 2026

టోర్నమెంట్ అతి త్వరలోనే జరగనుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ నిర్వహించనున్నారు. నెదర్లాండ్స్, బెల్జియం వేదికగా ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో హాకీ ప్రియులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఈ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో భారత హాకీ జట్టు తలపడనుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న ఈ వరల్డ్ కప్ కోసం ఇప్పటికే 20 మందితో కూడిన భారత జట్టును హాకీ ఇండియా ప్రకటించేసింది.

స్టార్ డ్రాగ్ ఫ్లిక్కర్ హర్మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు ఈ మెగా టోర్నమెంట్ లో పాల్గొంటుంది. ఈ వరల్డ్ కప్ లో భాగంగా పూల్ Dలో భారత జట్టు స్థానం దక్కించుకుంది. ఈ క్రమంలో ఆగస్టు 15వ తేదీన భారత్, వేల్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఆగస్టు 17న ఇంగ్లాండ్ తో తలబడనుంది. ఇక ఆగస్టు 19వ తేదీన హై వోల్టేజ్ మ్యాచ్ పాకిస్తాన్ తో ఉండనుంది. దీంతో ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande