మొదటి ODI: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. భారత జట్టులోకి రోహిత్, కోహ్లి
మొదటి ODI: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. భారత జట్టులోకి రోహిత్, కోహ్లి
Cricket


హైదరాబాద్, 14 జూలై (హి.స.)

భారత జట్టు ఇంగ్లాండ్ టూర్ లో భాగంగా ఈ రోజు మొదట వన్డే మ్యాచ్ జరగనుంది. బర్మింగ్హామ్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు మొదట బౌలింగ్ చేయనుంది. ఈ వన్డే సిరీస్ కు ముందు ఐదు మ్యాచుల టీ20 సిరీస్ వైట్ వాష్ తో ఓడిపోయిన భారత జట్టు.. ఈ వన్డే సిరీస్ పై కన్నేసింది. ఈ క్రమంలో కెప్టెన్ శుభ్ మాన్ గిల్ సారథ్యంలో సీనియర్ ప్లేయర్లు కోహ్లి, రోహిత్ల రాకతో జట్టు మరింత బలంగా మారింది. దీంతో టీ20 సిరీస్ ఘోర వైఫల్యానికి పగ తీర్చుకునేందుకు భారత జట్టు బరిలోకి దిగింది. కాగా నేటి మ్యాచులో గుర్నూర్ బ్రార్ (Gurnoor Brar) భారత తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.

భారత్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (సి),

విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (W), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్క్రీత్ బుమ్రా, ప్రసిద్ధ కృష్ణ

ఇంగ్లాండ్ ప్లేయింగ్ XI: జాకబ్ బెథెల్, బెన్ డకెట్, జో

రూట్, హ్యారీ బ్రూక్(సి), జోస్ బట్లర్(W), సామ్ కర్రాన్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande