రోహిత్పై బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇంగ్లండ్తో వన్డే మ్యాచే చివరిదా?
రోహిత్పై బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇంగ్లండ్తో వన్డే మ్యాచే చివరిదా?
రోహిత్పై బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇంగ్లండ్తో వన్డే మ్యాచే చివరిదా?


ఢిల్లీ, 17 జూలై (హి.స.): భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే కెరీర్ ముగింపు దశకు చేరిందా? ఈ నెల 19న లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగే మూడో వన్డేనే అతడి కెరీర్లో చివరి మ్యాచ్ కానుందా?వన్డే ప్రపంచ కప్ 2027లో ఆడాలన్నది టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కల. కానీ లార్డ్స్లో ఇంగ్లండ్తో ఆదివారం (జులై 19) జరిగే చివరి వన్డేనే హిట్మ్యాన్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావొచ్చు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంగ్లండ్తో సిరీస్ తర్వాత బీసీసీఐ సెలక్షన్ కమిటీ రోహిత్ను జట్టుకు ఎంపిక చేసే అవకాశం లేదట.

అనే ప్రశ్నలకు జాతీయ మీడియా కథనాలు అవుననే సమాధానమిస్తున్నాయి. అయితే.. దీనిపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఇంగ్లండ్తో సిరీస్ సందర్భంగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ సభ్యులు, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మతో సమావేశమయ్యారు. 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని టీమ్ను సిద్ధం చేయడంపై చర్చించినట్టు సమాచారం. ఈ మేరకు యువ ఆటగాళ్లను తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా రోహిత్ను ఇకపై వన్డేలకు దూరంగా ఉంచాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ నిర్ణయంపై హిట్మ్యాన్ అసంతృప్తిగా ఉన్నాడని కూడా నివేదికలు పేర్కొన్నాయి.

కాగా.. బీసీసీఐ సెలక్షన్ కమిటీ వన్డేల్లో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు మరిన్ని అవకాశాలు కల్పించాలని భావిస్తోంది. వచ్చే వరల్డ్ కప్ నాటికి రోహిత్కు 40 ఏళ్లు దాటనున్న నేపథ్యంలో భవిష్యత్తు జట్టును సిద్ధం చేయడంపై బీసీసీఐ దృష్టి సారించినట్టు వార్తలు వెలువడుతున్నాయి.

రోహిత్ ఇప్పటివరకు 286 వన్డేల్లో 11,731 పరుగులు సాధించాడు. 56 వన్డేల్లో భారత జట్టుకు సారథ్యం వహించిన హిట్మ్యాన్.. 2023 ప్రపంచకప్లో జట్టును ఫైనల్కు చేర్చడం సహా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే రోహిత్ భవితవ్యం ఏంటనే దానిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిఉంది. అప్పటివరకు ఇవన్నీ ఉహాగానాలే.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande