బంజారాహిల్స్ లో స్పా పేరుతో వ్యభిచారం.. ముగ్గురు అరెస్ట్
బంజారాహిల్స్ లో స్పా పేరుతో వ్యభిచారం.. ముగ్గురు అరెస్ట్
Spa


హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.)

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మిథాలీనగర్లోని ఓ అపార్ట్మెంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో స్పా నిర్వాహకుడు షేక్ ముస్తాక్ అహ్మద్(41), మేనేజర్ షేక్ పైసలుద్దీన్ (21), ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న ఇద్దరు మహిళలను బాధితులుగా గుర్తించి రక్షించారు. విచారణలో ముస్తాక్ అహ్మద్ రెండు నెలలుగా అపార్ట్మెంట్లోని ప్లాట్ను అద్దెకు తీసుకుని స్పా పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande