అమరావతి ఛాంపియన్షిప్ 2026.. తిరుపతిలో పోటీలను ప్రారంభించిన మంత్రులు
అమరావతి ఛాంపియన్షిప్ 2026.. తిరుపతిలో పోటీలను ప్రారంభించిన మంత్రులు
/amaravati-championship-tirupati-home-minister-anitha-sports-


తిరుపతి, 24 ఆగస్టు (హి.స.) తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈరోజు(సోమవారం) ఉదయం ఎస్వీ యూనివర్సిటీ తారకరామా గ్రౌండ్స్లో హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారికి క్రమశిక్షణ కీలమైందన్నారు. క్రమశిక్షణ ఉంటేనే జీవితంలో రానిస్తారని తెలిపారు.

ఇప్పుడు క్రీడాకారులుగా ఉన్న వారిలో ఐఏఎస్, ఐపీఎస్లు అయ్యేవారు ఉంటారని చెప్పారు. క్రీడాకారులకు మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. మట్టిలో మాణిక్యాలను తీసుకురావటానికి కృషి చేస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు హోం మంత్రి అనిత ధన్యవాదాలు తెలియజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande