
తిరుమల, 24 ఆగస్టు (హి.స.) తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం ఉదయం 7 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని 17 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులకు స్వామివారి దర్శనానికి 8-10 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. అలాగే దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు స్వామివారి దర్శనానికి 4-6 గంటలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3-4 గంటల సమయం పడుతుందని తెలిపింది. నిన్న (ఆదివారం) స్వామివారిని 81,553 మంది భక్తులు దర్శించుకోగా.. 34,483 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV