పిఠాపురం నియోజకవర్గ మహిళలకు రాఖీ కానుక చీరలను పంచిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
పిఠాపురం నియోజకవర్గ మహిళలకు రాఖీ కానుక చీరలను పంచిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
pawan


పిఠాపురం:, 27 ఆగస్టు (హి.స.)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తాను ప్రాతినిధ్యం వస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు చీరలు పంపించారు. గ్రామాల్లో పింఛన్లు పొందుతున్న 45 ఏళ్లలోపు వితంతు, ఒంటరి మహిళలను గుర్తించి.. రాఖీ కనుకగా 2,500 మందికి చీరలు పంపించారు. పిఠాపురం గొల్లప్రోలు మున్సిపాలిటీలతోపాటు పిఠాపురం గొల్లప్రోలు కొత్తపల్లి మండల పరిషత్ కార్యాలయాల ద్వారా రాఖీ పండుగ రోజు మహిళలకు పంపిణీ చేయనున్నారు. గత ఏడాది కూడా రాఖీ పౌర్ణమి సందర్భంగా డిప్యూటీ సీఎం చీరలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande