
సాలూరు, 28 ఆగస్టు (హి.స.)
,:ఏడేళ్లు కష్టపడి చదవితే తనకు టీచర్ ఉద్యోగం వచ్చిందని మెగా డీఎస్సీ విజేత ఉంగరాల కవిత అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని ఆమె ఇంటికి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెళ్లి పలకరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ ఎంపికలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తుంటే చాలా బాధగా ఉందని వాపోయారు. తాము ఎవరికీ లంచాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. తాము నలుగురు ఆడపిల్లలమని, రోజు కూలికివెళ్లే తల్లిదండ్రులకు లంచాలు ఇచ్చేంత స్థోమత లేదని పేర్కొన్నారు. లంచాలు ఇచ్చే పరిస్థితే ఉంటే 2018లో కేవలం అర మార్కు తేడాతో ఉపాధ్యాయ ఉద్యోగానికి దూరమయ్యేదానిని కాదని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ