
హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.)
ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బిఎలీ ల కృషి మరువలేనిదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. ఎలక్షన్ కమిషన్ సర్ ప్రక్రియపై నిర్వహిస్తున్న వార్డు సభలలో భాగంగా రసూల్ పుర గన్ బజార్ కమ్యూనిటీ హాల్ లో గురువారం జరిగిన సభలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బిఎల్ఎ లతో మాట్లాడుతూ ప్రతీ ఓటు ఎంతో విలువైందని, సంబంధిత బిఎల్ లు ఇన్ని రోజులు బాధ్యతగా విధులు నిర్వర్తించారని, అదే విధంగా ఇక ముందు కూడా జాబితాలో ఓటు లేని వారికి,నోటీసులు అందుకున్న వారికి అవగాహన కల్పించి, ఓటర్లు తమ విలువైన ఓటు హక్కును కాపాడుకునేందుకు ఏ విధంగా వ్యవహరించాలో తగినంత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. బిఎల్డీ లకు రావలసిన బకాయిలను కూడా ఇప్పించే బాధ్యత తనదేనని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు