తెలంగాణలో జనగణనకు లైన్ క్లియర్.. గెజిట్ పున:ప్రచురణకు ఆదేశాలు
తెలంగాణలో జనగణనకు లైన్ క్లియర్.. గెజిట్ పున:ప్రచురణకు ఆదేశాలు
Census


హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.)

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జనగణన 2027' (Census 2027) ప్రక్రియకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం (Government Of Telanagna) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ ఆగస్టు 14న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ నంబర్ 4505(E)ను తెలంగాణ రాష్ట్ర గెజిట్లో పున:ప్రచురించాలని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (GAD) ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే జనాభా గణనకు అధికారికంగా మార్గం సుగమమైంది. అయితే, జనగణన జనాభా లెక్కింపు విడతలో పౌరుల నుంచి మొత్తం 40 రకాల వివరాలను సేకరించాలని కేంద్ర రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ అధికారులను ఆదేశించారు. 1948 సెన్సస్ చట్టంలోని నిబంధనల ప్రకారం నియమించబడే ఎన్యూమరేటర్లు ఇళ్లకు వెళ్లి ఈ వివరాలను సేకరించేందుకు అధికారం కల్పించారు.

ఇప్పటికే 40 ప్రశ్నలకు నోటిఫై చేసిన కేంద్రం..

అయితే, జనగణనలో అడిగే 40 ప్రశ్నలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నోటిఫై చేసింది. వాటిలో కులం (Caste), కోవిడ్ టీకా(COVID Vaccine) వేయించుకున్న ప్రదేశం వంటి అంశాలు ఉన్నాయి. మహిళలు, పురుషుల లెక్కింపుతో పాటు కులం, ఉపకులాలను లెక్కించి జాబితా రూపొందించనున్నారు. జన గణన ప్రక్రియ సెప్టెంబర్ 1న ప్రారంభమై సెప్టెబర్ 30తో ముగియనుంది. అంతకు ముందే ఆగస్టు 17 నుంచి 31 వరకు ప్రజలు తమ వివరాలను స్వయంగా (Self-Enumeration) నమోదు చేసుకునే సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande