
హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.) తండ్రి మందలించాడనే మనస్తాపంతో ఓ బాలిక కఠిన నిర్ణయం తీసుకుంది. ఉప్పుగూడ రైల్వేస్టేషన్ వద్ద గూడ్స్ రైలుకు ఎదురుగా వెళ్లి ప్రాణాలు తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడకు చెందిన ఓ బాలిక అస్తమానం ఫోన్లో గడిపేది. ఇది గమనించిన తండ్రి.. పలుమార్లు ఆమెను మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ బాలిక.. ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత నేడు(గురువారం) ఉదయం ఉప్పుగూడ రైల్వేస్టేషన్ సమీపంలో శవమై తేలింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వెంటనే బాలిక వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్