రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో భారీగా మిగిలిపోయిన సీట్లు
రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో భారీగా మిగిలిపోయిన సీట్లు
రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో భారీగా మిగిలిపోయిన సీట్లు


అమరావతి, 28 ఆగస్టు (హి.స.)

రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో భారీగా సీట్లు అందుబాటులో ఉన్నా...వాటిలో చేరేందుకు విద్యార్థుల సంఖ్య ఆ స్థాయిలో కనిపించడం లేదు. ప్రైవేటు విద్యా సంస్థలు ఎడాపెడా సీట్లు పెంచుకుంటూపోతున్నా... అడ్మిషన్లు మాత్రం అందుకు అనుగుణంగా పెరగడం లేదు. ఈ ఏడాది ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగం తుది దశ కౌన్సెలింగ్ తాజాగా పూర్తయ్యింది. కన్వీనర్ కోటాలోనే 46,234 సీట్లు (31 శాతం) మిగిలిపోయాయి. ఈ కోటాలో 1,51,204 సీట్లు ఉండగా 1,04,970 సీట్లు(69 శాతం మాత్రమే) భర్తీ అయ్యాయి. ఇవి కాకుండా మేనేజ్మెంట్ కోటాలో సుమారు మరో 50వేల సీట్లు అందుబాటులో ఉంటాయి. ఈఏపీసెట్లో ర్యాంకు సాధించలేనివారు, నేరుగా డబ్బుకట్టి అడ్మిషన్లు పొందేవారు మేనేజ్మెంట్ కోటాకు వెళ్తారు. అయితే, వారు తక్కువ మందే ఉంటారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande