దేశ రక్షణ రంగంలో ఆందోళన: అమెరికా AI మోడళ్లను వాడుతున్న చైనా సైనిక పరిశోధకులు
దేశ రక్షణ రంగంలో ఆందోళన: అమెరికా AI మోడళ్లను వాడుతున్న చైనా సైనిక పరిశోధకులు
AI


హైదరాబాద్, 03 ఆగస్టు (హి.స.)

భారత సరిహద్దుల్లో నిత్యం కయ్యానికి కాలుదువ్వే చైనా, అధునాతన సాంకేతికతను తన సైనిక అవసరాల కోసం దొంగచాటుగా వాడుకుంటోందనే సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. చైనా సైనిక పరిశోధకులు అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్లను తమ డిఫెన్స్ సిస్టమ్స్ మరియు వ్యూహాత్మక నిర్ణయాల కోసం ట్రైనింగ్ చేయడానికి ఉపయోగిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేశాయి.

అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ, ఓపెన్ సోర్స్ ఏఐ టెక్నాలజీల ద్వారా చైనా మిలిటరీ రీసెర్చర్లు ఈ డేటాను సేకరిస్తున్నట్లు గుర్తించారు. ఈ పరిణామం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో, ముఖ్యంగా భారతదేశ సరిహద్దు భద్రతకు సంబంధించి సైనిక సమతుల్యతపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారతదేశం కూడా తన స్వదేశీ డిఫెన్స్ AI టెక్నాలజీలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోంది. చైనా చేస్తున్న ఈ సైనిక ఏఐ ప్రయోగాలపై అమెరికా మరియు భారత్ రక్షణ విభాగాలు నిఘాను మరింత తీవ్రం చేశాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande