బ్రిక్స్ (BRICS) సదస్సుకు హాజరుకావాల్సిందిగా బంగ్లాదేశ్ ప్రధానికి భారత్ ఆహ్వానం
బ్రిక్స్ (BRICS) సదస్సుకు హాజరుకావాల్సిందిగా బంగ్లాదేశ్ ప్రధానికి భారత్ ఆహ్వానం
brics


న్యూఢిల్లీ: , 05 ఆగస్టు (హి.స.)

వచ్చే నెల సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా జరగబోయే ప్రతిష్టాత్మక బ్రిక్స్ (BRICS) వార్షిక సదస్సుకు భారత్ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ సదస్సులో భాగంగా జరిగే ప్రత్యేక అవుట్‌రీచ్ సెషన్‌కు హాజరుకావాల్సిందిగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని తారిఖ్ రెహమాన్‌కు భారత విదేశాంగ శాఖ అధికారికంగా ఆహ్వాన పత్రం పంపింది బిమ్‌స్టెక్ (BIMSTEC) కూటమికి ప్రస్తుత చైర్మన్‌గా ఉన్న బంగ్లాదేశ్‌తో ద్వైపాక్షిక, ప్రాంతీయ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఈ సదస్సు వేదిక కానుందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం, ఆర్థిక సవాళ్లపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande