
హైదరాబాద్, 03 ఆగస్టు (హి.స.)
స్వతంత్ర పార్లమెంట్ సభ్యుడు (MP) పప్పు యాదవ్‌పై ఆయన ఢిల్లీ నివాసంలో విలేకరుల సమావేశం (Press Conference) నిర్వహిస్తుండగా ఊహించని విధంగా దాడి జరిగింది. ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆకస్మికంగా లోపలికి చొరబడ్డారు భారత జాతీయ వార్తలు. వారిలో ఒకరు ఎంపీ లక్ష్యంగా చెప్పు విసరగా, అది ఆయన పక్కనే ఉన్న మైక్ స్టాండ్‌కు తగిలింది.
వెంటనే అలర్ట్ అయిన ఎంపీ మద్దతుదారులు మరియు భద్రతా సిబ్బంది ఆ ఇద్దరు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో ఒకరి వద్ద చిన్న కత్తి కూడా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. పప్పు యాదవ్‌కు గతంలోనే కొన్ని గ్యాంగ్‌ల నుండి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఈ దాడి జరగడం దేశ రాజధానిలో తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. దేశంలో ఒక ఎంపీ స్థాయి వ్యక్తికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తూ కేంద్ర ప్రభుత్వం మరియు ఢిల్లీ పోలీసుల వైఫల్యంపై మండిపడ్డాయి. ఈ దాడి వెనుక ఉన్న అసలు సూత్రధారులను కనుగొనడానికి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi