
పశ్చిమ గోదావరి జిల్లా, 30 ఆగస్టు (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 1వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం 9:45కు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో సీఎం బయల్దేరనున్నారు. ఉదయం 10:30కు మొగల్తూరు హెలిప్యాడ్కు చేరుకుంటారు. సీఎంకు మొగల్తూరులో ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలకనున్నారు. మొగల్తూరు నుంచి రోడ్డు మార్గంలో నరసాపురానికి ముఖ్యమంత్రి ప్రయాణించనున్నారు.
ఉదయం 11:05కు పొన్నపల్లిలో ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారు. గోదావరి గట్టు వద్ద పెన్షన్ లబ్ధిదారులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అవుతారు. నరసాపురంలో గోదావరి నదిలో బోట్ రైడ్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు మొగల్తూరు ప్రజా వేదికకు సీఎం చేరుకుంటారు. ప్రజావేదిక సమావేశానికి హాజరై ప్రసంగిస్తారు. అనంతరం మొగల్తూరులో వివిధ స్టాళ్లను సందర్శించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ