
ఆదిలాబాద్, 30 ఆగస్టు (హి.స.)
అర్హులైన పేదలకు సేవ చేయడంలోనే అధికారులకు, ప్రజాప్రతినిధులకు సంతృప్తి ఉంటుందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పొన్నారి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులు కీర్తి లక్ష్మి-రామన్న దంపతులకు సారె అందించి శుభాకాంక్షలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు